సమ్మక్క జాతరకు పటిష్ట ఏర్పాట్లు
గోదావరిఖని: సమ్మక్క – సారలమ్మ జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా ట్లు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూ చించారు. నగర శివారులోని గోదావరితీర సమ్మ క్క–సారలమ్మ జాతర ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్లపై సింగరేణి ఆర్జీ–వన్ జీ ఎం లలిత్‌కుమార్, మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్షించారు. పుష్కరఘాట్ల వద్ద స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. భక్తులు అస్వస్థతకు గురైతే అత్యవసర వైద్యచికిత్స అందించడంతోపాటు వెంటనే ఆస్పత్రి తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చే యాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించా రు. నాయకులు మహంకాళి స్వామి, రమేశ్, శ్రీనివాస్, రాజేశ్, సింగరేణి శ్రీనివాస్, అధికారి రామన్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


