పుర ఓటర్లు 2.58 లక్షలు
సాక్షి పెద్దపల్లి:
జిల్లాలోని నగర/పట్టణ ఓటర్ల తుది జాబితా ను అధికారులు సోమవారం ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, మంథని, సు ల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మొత్తం 2,58,065 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఇందులో పురుషులు 1,28,281 మంది ఉండగా, మహిళలు 1,29,749 మంది, ఇతరులు 35మంది ఉన్నట్లు గు ర్తించారు. బల్దియాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల వారీగా, ఈనెల 16న ఓటరు ఫొటోలతో కూడిన ఓటరు జాబితా ప్రకటిస్తారు. కీలకమైన ఓ టరు జాబితా విడుదల కావడంతోపాటు, గుర్తుల ను సైతం ప్రకటించడంతో అందరిచూపు రిజర్వేషన్‌ల వైపు మళ్లింది. రిజర్వేషన్‌లు ఖరారైన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
75 గుర్తులు కేటాయింపు
5 జాతీయ, 4 రాష్ట్రీయ, మరో 4 రిజిష్టర్డ్ పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం మొ త్తంగా 75 గుర్తులను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణల తర్వాత బీఫామ్‌ల ప్రకారం పార్టీల గుర్తులు, స్వతంత్రులకు అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు.
డిపాజిట్‌లు ఇలా..
కౌన్సిలర్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, ఇతరులు రూ.2,500 డిపాజిట్ చెల్లించాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎ స్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేటర్ అభ్యర్థులు రూ.2,500, ఇతరులు రూ.5వేలు డిపాజిట్ చెల్లించాలని అధికా రులు తెలిపారు.
స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు ఇవే..
స్వతంత్ర అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. ఇందులో
ఎయిర్ కండిషనర్, యాపిల్, గాజులు, పండ్లబుట్ట, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైనాక్యులర్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారంబోర్డు, చెయిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరితోట, మంచం, కప్పు, సాసర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మెషీన్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, ఎన్వలప్‌కవర్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, ఫుట్‌బాల్ ఆటగాడు, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గ్రామ్‌ఫోన్ ఉన్నాయి. వీటితోపాటు ద్రాక్షపండ్లు, పచ్చిమిరపకాయ, తోపుడుబండి, హెడ్‌ఫోన్, హాకీ కర్ర–బంతి, పనసపండు, బెండకాయ, పోస్ట్‌డబ్బా, గొళ్లెం, లూడో, అగ్గిపెట్టె, మైక్, ముకుడు, ప్యాంట్, పెన్‌డ్రైవ్, అనాసపండు, కుండ, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, సేఫ్టీపిన్, కుట్టుమిషన్, కత్తెర, నౌక, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, స్విచ్‌బోర్డ్, టేబుల్, టెలిఫోన్, టూత్‌బ్రష్, ట్రంపెట్, టైర్స్, వయోలిన్, వాల్‌నట్, వాటర్‌మిలన్, బావి, ఈల, ఊలు–సూది గుర్తులు ఖరారు చేశారు. ఇందులో చాలా గుర్తులు ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం చేయడం కష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మున్సిపల్ ఓటర్లు
పట్టణం/నగరం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
రామగుండం 91,441 91,578 30 1,83,049
పెద్దపల్లి 21,660 22,127 02 43,789
మంథని 6,949 7,452 01 14,402
సుల్తానాబాద్ 8,231 8,592 02 16,825
మొత్తం 1,28,281 1,29,749 35 2,58,065


