తుది ఓటరు జాబితా విడుదల
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం తుది ఓటరు జాబితా ప్రకటించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా, టీపీబీవోలు హిమజ, సిందూజ పాల్గొన్నారు.
తుది ఓటరు జాబితా ప్రకటన
మంథని: మంథని పట్టణ తుది ఓటరు జాబితా ను మున్సిపల్ కమిషనర్ మనోహర్ విడుదల చేశారు. మొత్తం 13 వార్డుల్లో 14,402 మంది ఓటర్లు ఉన్నారని తేల్చారు.
151 అభ్యంతరాలు
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ ఓటరు జాబితాపై 151 అభ్యంతరాలు అందగా.. వాటిని పరిష్కరి స్తూ తుది జాబితా ప్రకటించామని కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. 36వార్డుల్లో తొలుత 43,845 మంది ఓటర్లతో జాబితా రూపొందించామని, అభ్యంతరాల స్వీకరణ అనంతరం 56 మంది ఓటర్లు పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.
పెద్దపల్లి: సుల్తానాబాద్ మున్సిపల్ ఓటరు తుది జాబితాను కమిషనర్ రమేశ్ ప్రకటించారు. ము సాయిదా ఓటరు జాబితాపై 35 అభ్యంతరాలు వచ్చాయన్నారు. అతిక్కువగా ఐదోవార్డులో 1,003 మంది, అత్యధికంగా 12వ వార్డులో 1,229 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మేనేజర్ అలీమొద్దీన్, ఏఈ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


