అర్జీలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పరిష్కరించాలి

Jan 13 2026 5:43 AM | Updated on Jan 13 2026 5:43 AM

అర్జీ

అర్జీలు పరిష్కరించాలి

పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అర్జీల రూపంలో అందిన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన ప్రజావాణి ద్వారా జి ల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ ల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వేణు మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తుల ను పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు.

కోడి పందాలపై నిఘా

గోదావరిఖని: సంక్రాంతి సందర్భంగా కోడిపందా లు, పేకాట నిరోధానికి ప టిష్ట నిఘా ఉంచినట్లు రా మగుండం పోలీస్‌ కమిష నర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తె లిపారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, ఆకస్మిక వాహన తనిఖీ, నాకాబందీ ని ర్వహిస్తామన్నారు. జిల్లా సరిహద్దుల్లోని కీలక ప్రదేశాల్లో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేశామని సీపీ వివరించారు.

సామాజిక సేవ చేయాలి

మంథనిరూరల్‌: సామాజిక సేవలో యువత ముందుండాలని సింగరేణి ఆర్జీ– 3 జీఎం మ ధుసూదన్‌ సూచించారు. కన్నాల శ్రీవేంకటేశ్వ ర యూత్‌ ఆరో ఆవిర్బావం సందర్భంగా గ్రా మంలో సోమవారం ఉచిత వైద్యశిబిరం ఏర్పా టు చేయగా జీఎం ప్రారంభించి మాట్లాడారు. యువకులు గొప్ప ఆలోచన, సంకల్పంతో యూత్‌ ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా సమాజసేవలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తామని, కన్నాలలోని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. కన్నాల, నాగారం సర్పంచులు గుడిసె గట్ట య్య, బెల్లంకొండ శ్రీదేవి – సత్యనారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ ఎరుకల లలిత, ఆర్‌ఎంపీ సత్యనారాయణ, ప్రైవేట్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి సందీప్‌, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

బాలికలకు ఎన్టీపీసీ అండ

జ్యోతినగర్‌(రామగుండం): బాలికా సాధికారతకు ఎన్టీపీసీ ముందు వరుసలో ఉంటుందని, ఇందులో భాగంగానే ఏటా వేసవి సెలవుల్లో 120 మంది బాలికలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్ట ర్‌ చందన్‌ కుమార్‌ సామంత అన్నారు. బాలికాసాధికారత మిషన్‌(జెమ్‌)లో ఎన్టీపీసీ కాకతీ య ఆడిటోరియంలో సోమవారం శీతాకాల శి క్షణ ముగింపు వేడుకలో పాల్గొని మాట్లాడారు. ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రలు అందజేశారు. దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రా ఖీ సామంత, జీఎం హెచ్‌.బిజయ్‌కుమార్‌ సిగ్ద ర్‌, డీజీఎం ప్రవీణ్‌ కుమార్‌ చౌదరి ఉన్నారు.

ఐపీఎఫ్‌ జిల్లా కార్యవర్గం

గోదావరిఖనిటౌన్‌: ఇంటర్‌ డీ నామినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌(ఐపీఎఫ్‌) జిల్లా కార్యవర్గా న్ని గ్లోరియస్‌ మినిస్ట్రీస్‌ చర్చిలో ఎన్నుకున్నా రు. అధ్యక్షుడిగా ఎం.మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కె.దాస్‌, జనరల్‌ సె క్రటరీగా పి.డిలైట్‌, జాయింట్‌ సెక్రటరీగా జె.ప్రహర్షి, కోశాధికారిగా ఇ.థామస్‌, ఎగ్జిక్యూటి వ్‌ సభ్యులుగా ఎ.రవివర్మ, పి.ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,661

పెద్దపల్లిరూరల్‌: వ్యవసాయ మార్కెట్‌లో సో మవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 7,661 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,088గా, సగటు రూ.7,388గా ఉందని మా ర్కెట్‌ ఇన్‌చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ సంస్కృతిని కాపాడింది కేసీఆరే..

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): తెలంగా ణ సంస్కృతి, సంసాంప్రదాయాలను కాపాడి న ఘనత తొలి సీఎం కేసీఆర్‌కే దక్కిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అ న్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక అబ్దుల్‌ కలాం స్డేడియంలో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌ పదేఏళ్ల పాలనలో ఆడబిడ్డల సంక్షేమానికి కృషి చేశారన్నారు. రాజిరెడ్డి, కౌశిక హరి, విజయారెడ్డి, అంజలీదేవి ఉన్నారు.

అర్జీలు పరిష్కరించాలి 1
1/3

అర్జీలు పరిష్కరించాలి

అర్జీలు పరిష్కరించాలి 2
2/3

అర్జీలు పరిష్కరించాలి

అర్జీలు పరిష్కరించాలి 3
3/3

అర్జీలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement