క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం
పెద్దపల్లి: క్రీడలు, క్రీడాకారులకు ప్రభుత్వం ప్రో త్సాహం అందిస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. యువత చురుకుగా పాల్గొనాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ క ళాశాల మైదానం నుంచి అయ్యప్ప ఆలయం వరకు సోమవారం సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే పాల్గొన్నారు. క్రీడలపై అవగాహన కల్పించేందుకు రెండో ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ – 2025 ద్వారా టార్చ్‌ర్యాలీ చేపట్టామని ఆయన తెలిపారు. డీవైఎస్‌వో సురేశ్‌కుమార్, అధికారులు రంగారెడ్డి, నరేందర్, రంగారావు, రాజశేఖర్, ప్రతినిధులు సదానందం, అన్నయ్యగౌడ్, ప్రకాశ్‌రావు, ఎం.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తి వివేకానంద
స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లా డారు. ప్రతినిధులు సామల హరికృష్ణ, అంతటి అ న్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, సామల రా జేంద్రప్రసాద్, వేగోళం అబ్బయ్యగౌడ్, సాయిరి మ హేందర్, బిరుదు కృష్ణ, పన్నాల రాములు, ఊట్ల వరప్రసాద్, ముస్త్యాల, రవీందర్, గజభింకార్ శ్రీనివాస్, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, డి.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం
పెద్దపల్లిరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పెద్దపల్లిని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతా మని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. పెద్దపల్లి అభివృద్ధిని గత పాలకు లు విస్మరించినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చిరకాలవాంచ బస్సు డిపో ఏర్పాటుతో సహా బైపాస్ రోడ్డు, రూరల్, మహిళా, ట్రాఫిక్, ఎలిగేడు పోలీస్‌స్టేషన్‌లను ఏకకాలంలో మంజూరు చేసిందని తెలిపారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, తూముల సుభాష్‌రావు, బూతగడ్డ సంపత్, అమ్రేశ్, ఎరుకల రమేశ్, రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


