అధికారులపై ఆరోపణలు సరికాదు
మంథని: రాష్ట్రాభివృద్ధికి అధికారులు నిస్పక్షపాతంగా పనిచేస్తుంటే కొందరు రాజకీయ లబ్ధికోసం స త్యదూరమైన కథనాలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడం సరికాదని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. పట్టణంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కొందరు ఐఏఎస్ అధికారు లు, ప్రభుత్వ పెద్దలపై కొన్ని మీడియా సంస్థలు, ప్రధాన సోషల్ మీడియాలో కథనాలు ప్రసారం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు తొట్ల తిరుపతియాదవ్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.10లక్షలతో శ్రీరాంనగర్‌లో బస్ షెల్టర్, కూచిరాజ్‌పల్లి వద్ద రూ.4.50 కోట్లతో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం రూ.10 లక్షలతో బస్తాండ్, గంగాపూరిలో బొక్కలవాగుపై రూ.9కోట్ల 30లక్షలతో వంతెన, కుల సంఘాల భవనాల నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశా రు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు స్థలా న్ని మంత్రి పరిశీలించారు. ఇందిరమ్మ లబ్ధిదా రులకు ప్రొసీడింగ్స్ అందించారు. ఎల్–2, ఎల్–3 దరఖాస్తులు పరిశీలించి మరో 300 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.


