బ్యాలెట్‌తోనే పురపోరు
● నేడు తుది ఓటరు జాబితా విడుదల ● ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలికల ఎన్నికలనూ బ్యాలెట్ పద్ధతిన నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. ఈనెల 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఇందుకోసం అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవాలని ఈసీ ఇటీవల మున్సిపల్ కమిషనర్లకు సూచించింది. జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు.. డీసీసీ, బీఆర్‌ఎస్ అధ్యక్షులు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్, కోరుకంటి చందర్‌తోపాటు పెద్దపల్లి ఎమ్మె ల్యే సీహెచ్ విజయరమణారావు ఇటీవల తమ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పురపోరులో అన్ని సీట్లలో విజయం సాధించడం లక్ష్యంగా ముందుకు సాగాలని వారిని సమాయత్తం చేశారు. గ్రూపు తగాదాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో సూచించడతో ఆ మేరకు నేతలు ముందుకు సాగుతున్నారు.


