పెండింగ్ పనులు పూర్తిచేయండి
● అదనపు కలెక్టర్ వేణు
పెద్దపల్లి: సమ్మక్క–సారలమ్మ జాతర పనులు సకాలంలో పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. గోలివాడ, గోదావరిఖని, నీరుకుల్లలో నిర్వహించే సమ్మక్క – సారలమ్మ జాతర ఏర్పాట్లపై శుక్రవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర జరుగుతుందని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, పారిశుధ్య పనులు చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని, 108 వాహనం, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైనచోట సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జాతర వరకు ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఏసీపీ కృష్ణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, సీ– విభాగం పర్యవేక్షకుడు కుమారసస్వామి పాల్గొన్నారు.


