పనులు నాణ్యతతో పూర్తి చేయాలి
గోదావరిఖని(రామగుండం): నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రధాన చౌరస్తాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రుల పర్యటన త్వరలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి పరిస్థితులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం, తరగతి గదులు, మౌలిక వసతుల స్థితిగతులను పరిశీలించారు. విద్యా సంస్థల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యమని, విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లక్ష్మీనగర్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, నాయకులు మహంకాళిస్వామి తదితరులున్నారు.
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్


