ఉత్తమ ఫలితాలు సాధించాలి
పెద్దపల్లి: టెన్త్, ఇంటర్ విద్యార్థినులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రంగంపల్లి బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను బుధవారం కలెక్టర్ సందర్శించారు. స్టడీ అవర్స్‌పై ఆరా తీశారు. తాజా కూరగాయలతో కూడిన కూరలు, నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.
రుణాల రీకవరిపై ప్రత్యేక దృష్టి
మహిళా సంఘాలు రుణాల రీకవరిపై దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సెర్ప్ కార్యకలాపాలపై తన కార్యాలయంలో సమీక్షించారు. 2025–26లో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ ల క్ష్యంలో 90 శాతం పూర్తిచేశామని తెలిపారు. పను లు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేస్తామ ని తెలిపారు. డీఆర్డీవో కాళిందిని, అదనపు డీఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు. అనంతరం సెర్ప్ ఉద్యోగు లు కలెక్టర్‌ను కలిసి దుప్పట్లు అందజేశారు. వాటిని అనాథ పిల్లలకు పంపిణీ చేయాలని కోరారు.


