జీజీహెచ్‌లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రసవాల సంఖ్య పెంచాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం సిమ్స్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంతర్గాం పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో సమీక్షించారు. నెలలు నిండిన గర్భిణులను ట్రాక్ చేస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయాలన్నారు. గైనకాలజిస్ట్‌లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. టిఫా స్కానింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయని, ఆశ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ పరిధిలోని గర్భిణులను ప్రసవాల కోసం జీజీహెచ్‌కు తీసుకురావాలని ఆదేశించారు. ఎన్‌సీడీ (అసంక్రమిత వ్యాధులు) స్క్రీనింగ్‌లో నెలవారీ లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. ప్రతీమధుమేహం, రక్తపోటు కేసును ఎన్‌సీడీ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతీ క్యాన్సర్ కేసును తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలన్నారు. అనంతరం జీజీహెచ్‌లోని గైనకాలజీ విభాగం హెచ్‌వోడీలతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు రాజమౌళి, వాణిశ్రీ, శ్రీరాములు, కిరణ్‌తోపాటు ఓబీజీవై ప్రొఫెసర్, జీజీహెచ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అరుణ, ఓబీజీవై ప్రొఫెసర్, హెచ్‌వోడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


