స్టేటస్‌ తెలుసుకోవడమిలా.. | - | Sakshi
Sakshi News home page

స్టేటస్‌ తెలుసుకోవడమిలా..

Jul 28 2025 7:29 AM | Updated on Jul 28 2025 7:29 AM

స్టేట

స్టేటస్‌ తెలుసుకోవడమిలా..

జ్యోతినగర్‌(రామగుండం): కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుదారులు తమకార్డు ఆమోదం పొందిన విషయం తెలుసుకోవడం ఇక సులువే. తెల్లరేషన్‌ కార్డు మంజూరు అయిందో లేదో తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ https://epds. telangana.gov.in/FoodSecurityAct/ని క్లిక్‌ చేయండి. ఆ తర్వాత తొలిఆప్షన్‌ FSC Sear chపై క్లిక్‌ చేయండి. స్క్రీన్‌పై కనిపించే రేషన్‌ కార్డు సర్చ్‌ పైక్లిక్‌ చేయాలి. ఆ తర్వాత FSC Application Search పై క్లిక్‌ చేయాలి. మీసేవ దరఖాస్తు నంబర్‌, జిల్లా పేరు నమోదు చేయగానే మీ రేషన్‌ కార్డు స్టేటస్‌ గురించిన పూర్తి సమాచారం తెలుస్తుంది.

పొలాలకు బాటలు వేయాలి

కమాన్‌పూర్‌(మంథని): కమాన్‌పూర్‌ పెద్దచెరు వు, జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లోని పంట పొలాలకు రోడ్లు నిర్మించాలని పీఏసీఎస్‌ చై ర్మన్‌ ఇనగంటి భాస్కర్‌రావు కోరారు. మంత్రి శ్రీధర్‌బాబును హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

సర్వేయర్‌ పరీక్ష ప్రశాంతం

రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూలో ఆదివారం లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ పరీక్ష నిర్వహించారు. రెండు నెలల పా టు శిక్షణ పొందిన 112 మంది అభ్యర్థుల్లో 89 మంది పరీక్షకు హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ వేణు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు చే పట్టారు. పరీక్షల నోడల్‌ అధికారిగా సర్వే అసి స్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డిప్యూటి నోడల్‌ అధికారిగా రామగిరి తహసీల్దార్‌ సుమన్‌, పరిశీలకులుగా పెద్దపల్లి జిల్లా ట్రైజరీ అధికారి కొండ కరుణాకర్‌, ఇన్‌చార్జి చీఫ్‌ సూపరింటెండెంట్‌గా బాలనాగమణి వ్యవహరించారు.

బొగ్గు గనుల పరిరక్షణకు పోరు

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): బొగ్గు ప రిశ్రమ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఉ ద్యమాలు చేపడతామని, సింగరేణి కార్మికులు ఇందులో భాగస్వాములు కావాలని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. స్థానిక బీఎంఎస్‌ కార్యాలయంలో ఆదివారం బొగ్గు గనుల పరిరక్షణ ప్రచార వాల్‌పోస్టర్‌ను యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సారంగపాణితో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాంట్రాక్ట్‌ హక్కుల పరిరక్షణ కోసం సెప్టంబర్‌ వరకు చేపట్టే ఆందోళనలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో నాయకులు వడ్డేపల్లి కుమారస్వామి, వేణుగోపాల్‌రావు, రవీందర్‌, గట్టు శ్రీనివాస్‌, రవి, సత్తయ్య, మల్లారెడ్డి, కోటయ్య, లింగం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలోని రంగంపల్లి, ఇండేన్‌ గ్యాస్‌ గోదాం, బీసీ హాస్టల్‌ ఏరియాలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. విద్యుత్‌ తీగలు, స్తంభా లు, ఇతరత్రా మరమ్మతుల దృష్ట్యా విద్యుత్‌ స రఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. విని యోగదారులు సహకరించాలని కోరారు.

జోరుగా వరినాట్లు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. ఆదివారం కాస్త తెరిపించ్చింది. దీంతో వరినారు నాటేందుకు ఎదురు చూస్తున్న రైతులు వరినాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. అంతేకాదు.. ఒకవేళ వర్షం కురిసినా కూలీలు తడవకుండా రెయిన్‌కోట్లు ధరించి పొలం మడుల్లో నాట్లు వేస్తూ ఇలా కనిపించారు.

స్టేటస్‌ తెలుసుకోవడమిలా.. 1
1/3

స్టేటస్‌ తెలుసుకోవడమిలా..

స్టేటస్‌ తెలుసుకోవడమిలా.. 2
2/3

స్టేటస్‌ తెలుసుకోవడమిలా..

స్టేటస్‌ తెలుసుకోవడమిలా.. 3
3/3

స్టేటస్‌ తెలుసుకోవడమిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement