● అడ్డంకులు అధిగమించి పేదలకు మేలు ● సన్నబియ్యం పంపిణీలో
అభివృద్ధిని అడ్డుకునే కుట్ర
మంథని: రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని విన్నివిస్తే.. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధికి అ డ్డుపడుతున్నాయని, ఇలాంటి అడ్డంకులు అధిగమించి పేదలకు మేలుచేసే దిశగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక నృసింహ శివకిరణ్ గార్డెన్‌లో మంథని, ముత్తారం, రామగిరి, క మాన్‌పూర్ మండలాలకు చెందిన తెల్లరేషన్ కార్డుదారులకు శుక్రవారం రాత్రి సన్నబియ్యం పంపిణీని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దొడ్డుబియ్యంతో పేదలు అసౌకర్యానికి గురయ్యారని, మాటకు క ట్టుబడి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. అడవిసోమన్‌పల్లి లో రూ.200 కోట్లతో కార్పొరేట్ పాఠశాల, కళాశాల కు ధీటుగా యంగ్ ఇండియా స్కూల్ చేపట్టామన్నా రు. గతంలో బస్తాకు రెండు నుంచి నాలుగు కిలోల ధాన్యం కోత ఉండేదని, తాము అధికారంలోకి వ చ్చిన వెంటనే ఆ సమస్యకు చెక్ పెట్టామని చెప్పా రు. ఆధునిక వ్యవసాయంపై దృష్టి పెట్టామని, త్వ రలోనే డ్రోన్లు ఉపయోగించే పద్ధతి అమలు చేస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీలో డీలర్లు పొరపాట్లు చేయవద్దని సూచించారు. రేషన్ డీలర్ల సమస్యల ప రిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని అన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణు, మంథని సింగిల్‌విండో చై ర్మన్ కొత్త శ్రీనివాస్, టీజీ ఈఆర్‌సీ సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఆర్‌టీఏ సభ్యుడు మంథని సురేశ్, తహసీల్దార్ గిరి పాల్గొన్నారు.


