రామగిరి(మంథని): వాస్తవాలను ప్రజలకు తెలియచేప్పేందుకే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి తెలిపారు. సెంటినరీకాలనీ శ్రీపాదభవన్‌లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్‌దాధ్వర్యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమన్నారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్య్రం వచ్చాక దేశంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తున్న తీరు గురించి వివరించాలన్నారు. మంథని ముద్దుబిడ్డ దుద్దిళ్ల శ్రీపాదరావు అందించిన సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, రోడ్డ బాపన్న, గంట వెంకటరమణారెడ్డి, ఆరెల్లి దేవక్క, తోట చంద్రయ్య, కండె పోచం, కోట రవీందర్‌రెడ్డి, వనం రాంచందర్‌రావు, బర్ల శ్రీనివాస్, కాటం సత్యం, ముస్త్యాల శ్రీనివాస్, బంక్ మల్లేశ్, సందెల కుమార్, మాదాసు శ్రీనివాస్, కెక్కర్ల స్వరూప, జాగిరి రజిత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి


