పల్లెల్లోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వెలుగులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఊరూరా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, కొందరు అధికారులు.. రూ.లక్షలు వెచ్చించి గ్రామాల్లో హడావుడిగా బోర్డులు ఏర్పాటు చేశారు.. ఇవే క్రీడా ప్రాంగణాలు అని ప్రకటించారు. స్పోర్ట్స్ కిట్లు గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయాలకు చేరినా కొన్ని కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పుడైనా క్రీడామైదానాల్లో సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకు రావాలని క్రీడాకారులు కోరుతున్నారు. – సుల్తానాబాద్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
బోర్డులున్నాయి.. మైదానాలే లేవు
బోర్డులున్నాయి.. మైదానాలే లేవు
బోర్డులున్నాయి.. మైదానాలే లేవు