● బల్దియా కమిషనర్ అరుణశ్రీ
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియాలోని స్లాటర్‌హౌస్ భవన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను ఆమె శనివారం పరిశీలించారు. మల్కాపూర్ శివారులోని పశువధశాల కిటికీలు చోరీకి గురవడంతోపాటు గోడల నుంచి తొలగించిన కిటికీల ప్రాంతాల్లో మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలన్నారు. అనంతరం 39వ డివిజన్ ఖాజీపల్లిలో చేపట్టిన రోడ్డు పనులు, 29వ డివిజన్ బాపూజీనగర్ ప్రధాన రహదారిలో చేపట్టిన నీటిసరఫరా పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి నీటికొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాభాజ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి తదితరులు ఉన్నారు.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ ధరఖాస్తుదారులు రుసుంలో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర సంస్థ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ, ఈనెలాఖరుతో గడువు ముగుస్తుందని, ఈలోగా రుసుం చెల్లించాలన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ ప్రసాద్, అధికారి నవీన్ పాల్గొన్నారు.