సైదాపూర్(హుస్నాబాద్): ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండలంలోని గొల్లగూడెంకు చెందిన మర్రి సదానందం (47) మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు శుక్రవారం సైదాపూర్ వెళ్తుండగా బొత్తల్లపల్లి వద్ద మర్రి సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో సదానందం తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది 108లో సదానందంను హుజూరాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందినట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతుడి వయస్సు 35–40 మధ్య ఉంటుందన్నారు. నల్లటి జీన్స్ ప్యాంట్, బ్లూ కలర్ ఫుల్‌షర్టు ధరించి ఉన్నాడన్నారు. తలపగిలి నుజ్జునుజ్జు కావడంతో ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఆయన పేర్కొన్నారు. సంబంధీకులు ఉంటే సెల్ నంబరు 99493 04574, 87126 58604లో సంప్రదించాలని ఆయన కోరారు.
ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం
హుజూరాబాద్: తుమ్మన్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో శుక్రవారం ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్(21) కరీంనగర్ జిల్లా ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్‌ఎండీలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వృద్ధురాలు అదృశ్యం
కొత్తపల్లి(కరీంనగర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్‌కు ప్రయాణిస్తూ అదృశ్యం అయింది. నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి, ఎత్తు ఐదడుగులు ఉంటుంది. గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె కోసం బంధువులు, పోలీసులు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించడం లేదు. ఆమె కనిపిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ నంబర్లు 9494490268/ 8712670765లకు సమాచారం అందించాలని, వారికి నగదు పారితోషికం ఇవ్వబడుతుందని ఎస్‌హెచ్‌వో, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి