● అసెంబ్లీలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
సాక్షి, పెద్దపల్లి: పదేళ్లలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క కొత్తరేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక లు నిర్వహిస్తే అక్కడ కొత్త రేషన్ కార్డులు, కొత్త ప థకాలు ప్రవేశపెట్టి ఎన్నికలపైనే దృష్టి సారించార ని, ప్రజలకు న్యాయం చేయలేదన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా అ ర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించామన్నా రు. అర్హులైన ప్రతీఒక్కరికి కొత్తరేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే రేషన్‌కార్డుదారులకు సన్నబి య్యం అందించనున్నామని విజయరమణారావు అన్నారు. గతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు. కాళేశ్వరం పేరిట ప్రజల సొమ్మును నీళ్లపాలు, రాళ్లపాలు చేసిందని ధ్వమెత్తారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రారు, అభినందించరు, సలహా ఇవ్వరు.. కానీ సీఎం ఇట్లా, భట్టి విక్రమార్క అట్లా అని విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.