పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 14 మండలాల్లో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. ఇందులో తొమ్మిది మంది గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్‌స్వాడ్స్‌తోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పరీక్ష కేంద్రం మార్పుతో పరేషాన్
మంథని: పదో తరగతి పరీక్ష కేంద్రం మార్పుతో విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడింది. గతంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, గురుకుల బాలుర వి ద్యాలయంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పా ఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇ వి పట్టణ శివారులో ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బ స్టాండ్‌కు సమీపంలో ఉన్న బాలుర, జెడ్పీ బాలిక ల హైస్కూల్‌లో ఏర్పాటు చేయకుండా ఈసారి బాలుర జెడ్పీ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పా టు చేయడంతో విద్యార్థులు తికమకపడ్డారు. స్కూల్‌కు ఇరు వైపులా రోడ్డు ఉన్నా.. ఎటువైపు నుంచి వెళ్లాలో సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. కనీస సౌకర్యాలు కల్పించలేదు.
జిల్లాలో 99.87శాతం హాజరు
‘పది’ పరీక్షలు ప్రారంభం