గోదావరిఖని/రామగుండం: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గోదావరినదికి జీవం పోస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఎడారిగా మార్చిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిగోస.. ప్రజలు, రైతుల బాధలను మాజీ సీఎం కేసీఆర్ విన్నవించేందుకు ‘గోదావరి గోస మహాపాదయాత్ర’ను ఈశ్వర్ సోమవారం ప్రారంభించా రు. జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ ఎ మ్మెల్యే దివాకర్‌రావు హాజరయ్యారు. ఈశ్వర్, చందర్ మట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమ యంలో ఎండిన గోదావరి నదితో రైతన్నల కన్నీ ళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్.. కాళేశ్వ రం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిచారని గుర్తుచేశా రు. ఆచరణకు యోగ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్‌పై అక్కసుతో కా ళేశ్వరం ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విశిష్టత, కాంగ్రెస్ సర్కారు ని ర్లక్ష్య వైఖరి ఎండగడుతూ ఈనెల 22వరకు ఎర్రవెల్లికి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలి పారు. నాయకులు మూల విజయారెడ్డి, అముల నారాయణ, కౌశిక హరి, పెంట రాజేశ్, బాదె అంజలి, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మహాపాదయాత్రకు బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం బైపాస్ వద్ద ఘనస్వాగతం పలికారు.
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ తీరును ఎండగడతాం