గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య

గుర్ల: మండలంలోని గూడెంగ్రామానికి చెందిన శనపతి సంతోష్‌(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన శనపతి సంతోష్‌ జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూలో అవుట్‌ సోర్సింగ్‌లో మొటలర్జీ డిపార్ట్‌మెంట్‌ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. జేఎన్‌టీయూలో తనతో పాటు పనిచేస్తున్న అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఏడుగురు సిబ్బంది సంతోష్‌ను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక గూడెంలోని తన నివాసం వద్ద గడ్డి మందు కూల్‌ డ్రింక్‌లో కలుపుకుని తాగేశాడు. గడ్డి మందు తాగే ముందు నా ఆత్మహత్యకు జేఎన్‌టీయూలో పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులే కారణమని లేఖలో రాశాడు. గడ్డి మందు తాగిన సంతోష్‌ పరిస్థితిని కుటుంబ సభ్యులు చూసి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. తల్లి రాములమ్మ, తమ్ముడు సతీష్‌ ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement