● కలెక్టరేట్ ఎదుట ఎస్‌టీయూ నిరసన
విజయనగరం అర్బన్ : టెట్ స్పెషల్ నోటిఫికేషన్‌లో ఉపాధ్యాయుల సమస్యలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ ఎం.అరుణకుమారికి ఉపాధ్యాయులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్పెషల్ టెట్‌ను ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బోధించే సంబంధిత సబ్జెక్టుకు మాత్రమే సిలబస్‌ను పరిమితం చేయాలన్నారు. అభ్యర్థులందరికీ సమానమైన అర్హత మార్కులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్, అధ్యక్షుడు వై.అప్పారావు, రాష్ట్ర నాయకులు వి.గోవిందరావు, ఆర్థిక కార్యదర్శి ఎస్‌ఎస్.దొర, పి.రమేష్, సీహెచ్ మురళి, ఇ.సంతోష్ కుమార్, వి.మల్లేశ్వరరావు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


