రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన

Aug 28 2026 1:15 AM | Updated on Aug 28 2026 1:15 AM

రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట పాలన

రేగిడి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దుష్ట పాలన చేస్తుందని, నిరుద్యోగులను మోసగించి, టీడీపీ కార్యకర్తలకు ఉపాధ్యాయ పోస్టులు కట్టబెడుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ తలే రాజేష్‌ అన్నారు. రేగిడిలో ఓ పైవేట్‌ కార్యక్రమానికి గురువారం వచ్చిన వారు స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సూపర్‌ సిక్స్‌ సంక్షేమం అటకెక్కిందని, అధికారంలోకి వచ్చిన కూటమిలో విద్యా శాఖ మంత్రి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుద్రోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మెగా డీఎస్సీలో కొంతమంది అనర్హులకు తప్పుడు మార్గంలో ఉద్యోగాలు ఇచ్చారని, వాటిపై సీబీఐ విచారణకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టుబడితే తప్పించుకుతిరుగుతున్నారని ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలకు సీబీఐ ఎంకై ్వరీ వేస్తారా అని నారా లోకేష్‌ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, మా పార్టీ పాలనలో జరిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు మేం ఏ ఎంకై ్వరీకై నా సిద్ధమేనని మా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే వెల్లడించారని తెలిపారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు ఎందుకు లోకేష్‌ సిద్ధం కావడంలేదని, వెన్నుపోటు పార్టీకి సీబీఐ అనగానే వెన్నులో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా చేసిన అక్రమాలకు బేషరతుగా సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భవిష్యత్తులో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వారి వెంట పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, రేగిడి మండల పార్టీ అధ్యక్షుడు వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ విక్రాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement