వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని అధినేత సూచించినట్టు నాయకులు తెలిపారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలేరాజేష్ ఉన్నారు. – సాక్షి నెట్‌వర్క్


