వితంతువులకు పింఛనే ఆధారమైనా..
సీతానగరం మండలం బగ్గందొరవలస గ్రామానికి చెందిన కపరపు మంగమ్మ, కోట్ల రమణమ్మ వితంతువులు. మంగమ్మ భర్త 12 ఏళ్ల క్రి తం చనిపోయాడు. రమణమ్మ భర్త మూడేళ్ల కింద ట మరణించాడు. అప్పటి నుంచి వారిద్దరికీ ఏ ఆధారమూ లేదు. ఇద్దరిదీ ఒకేలాంటి సమస్యే. కుటుంబంలో రేషన్‌కార్డులో అత్తతో పాటు వారి పేరు ఉండడంతో పింఛన్‌కు నోచుకోలేకపోతున్నారు. ఇటీవల కార్డు నుంచి వేరుపడి మరోసారి పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు మంజూరు కాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బతుకుతెరువు కష్టంగా ఉందని..పింఛన్ మొత్తం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


