కలెక్టరేట్ ఆవరణలో ఆధార్ నమోదు కేంద్రం
పార్వతీపురం: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆధార్ నమోదు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు కొత్త ఆధా ర్ కార్డులు, వాటిలో మార్పులకోసం దరఖాస్తు చేసుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అన్నిరకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నా రు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లు నిండిన పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, ఆధార్ సెంటర్ సమన్వయకర్త రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ‘మన్యం కళావేదిక’ పేరిట కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..మాతృభాష మన అస్తిత్వానికి ప్రతీక అని, యువత భాషపై మక్కువ పెంచుకోవాల ని సూచించారు. కవిత్వం కేవలం ప్రాసల కో సం కాకుండా, పరోక్షంగా లోతైన అర్థాన్నిస్తూ ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేదిక కళా కారుల గుర్తింపునకే కాకుండా, సామాన్యులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేలా ఉండాలన్నా రు. కార్యక్రమంలో 24 మంది కవులు పాల్గొనగా వారిని సత్కరించారు. డీఆర్వో కె. హేమల త, డీవీఈఓ వై.నాగేశ్వరరావు, డీడీ ఆర్.కృష్ణవే ణి, ప్రముఖ కవులు గంటేడ గౌరు నాయుడు, రౌతు వాసుదేవరావు, భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జామి: గతేడాది డిసెంబర్ 27న నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ (ఈఈఎంటీ)లో కుమరాం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని పొన్నగంటి పల్లవి జిల్లా ఫస్ట్ సాధించినట్టు పాఠశాల హెచ్‌ఎం బాబులాల్ తెలిపారు. రూ.12వేల నగదు ప్రోత్సాహం అందజేశారన్నారు. విద్యార్థినిని హెచ్‌ఎంతో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
కలెక్టరేట్ ఆవరణలో ఆధార్ నమోదు కేంద్రం


