ఉద్యోగానికి రావద్దు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగానికి రావద్దు

Jan 13 2026 5:54 AM | Updated on Jan 13 2026 5:54 AM

ఉద్యో

ఉద్యోగానికి రావద్దు

ఉద్యోగానికి రావద్దు

బకాయి జీతం చూద్దాం గర్భిణుల వసతిగృహాల సిబ్బందికి చేదు అనుభవం పోస్టుల మంజూరు లేదంటూ.. ఏడేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను రోడ్డు మీద పడేసిన ప్రభుత్వం

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో సిబ్బంది వేడుకోలు

అనుకోని ప్రమాదం.. చేసింది గాయం

సాక్షి, పార్వతీపురం మన్యం:

లెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీదారులు తమ సమస్యలపై విజ్ఞప్తులు అందించా రు. ఎంతోకాలంగా తిరుగుతున్నా.. విన్నపాలు బుట్టదాఖలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతాదృక్పథంతో పరిష్కరించాలని వేడుకున్నారు.

చావా? బతుకా? అన్నట్లు ఉంది..

సాలూరు, గుమ్మలక్ష్మీపురం గిరిజన గర్భిణుల వసతిగృహా(వైటీసీ)ల్లో పొరుగు సేవల ప్రాతిపదికన దాదాపు ఏడేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడేసింది. గిరిశిఖర ప్రాంతాల్లో ఉంటున్న గర్భిణులను ప్రసవానికి ముందే ఇక్కడికి తీసుకొచ్చి..పురుడు పోసిన తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకే చేర్చే సదుద్దేశంతో ఈ వసతిగృహాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం వాటిని నిర్వీర్యం చేసేలా జిల్లా పాలకుల అడుగులు ఉన్నాయి. అందులో పని చేస్తున్న సిబ్బందిని నాలుగు నెలల క్రితం తొలగించిన విషయం విదితమే. వారి స్థానంలో ఏరియా ఆస్పత్రి సిబ్బందిని నియమించారు. అప్పటి నుంచి గతంలో పని చేస్తున్న ఉద్యోగులు విధులకు వెళ్తున్నా..హాజరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. మూడేళ్ల జీతాల బకాయిలను కూడా చెల్లించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా..పోస్టుల మంజూరు అధికారికం కాదని, ఇంక పని చేయడానికి వీలుపడదని అంటున్నారు. ఉద్యోగులంతా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వస్తూనే ఉన్నారు. ఈ వారం కూడా వచ్చారు. అధికారులను కలిసి మొర పెట్టుకున్నారు. పండగ పూట పిల్లలతో సంతోషం లేదని వాపోయారు. తమకు ఇది చావు, బతుకుల సమస్య అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల జీతాల బకాయి కూడా ఉందని వివరించారు. అధికారులు మాత్రం..‘మీ ఉద్యోగం లేదు. కొనసాగించడం కుదరదు. ముందు విధులకు రావడం మానేయండి.. అప్పుడే బకాయి జీతాల సంగతి ఆలోచిస్తాం’ అంటూ బదులిచ్చారు. దీంతో వారు పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరం వెలుపలే బైఠాయించి, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దబ్బాటి శంకరరావు. పాచిపెంట మండలం ఆజూరు పంచాయతీ కుంబివలస గిరిశిఖర గ్రామం. ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి

చెందిన శంకరరావు.. 2023లో జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుడికాలు పూర్తిగా తొలగించగా..ఎడమ కాలు సైతం సక్రమంగా పని చేయదు. కుడిచేయి కూడా కుంచించుకుపోయింది. అప్పటి నుంచి ఏ పనీ చేసుకోలేకపోతున్నాడు. గతేడాది జూన్‌లో దివ్యాంగ

పింఛన్‌ కోసం సదరం ధ్రువీకరణపత్రం చేయించుకున్నాడు. 70 శాతం వికలాంగత్వం ఉండడంతో పలుమార్లు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు వచ్చి మరోసారి అర్జీ అందించాడు.

ఉద్యోగానికి రావద్దు1
1/1

ఉద్యోగానికి రావద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement