నేరాల నియంత్రణకు చర్యలు : ఎస్పీ
వంగర: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పని చేయాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. అల్లర్లు సృష్టించే రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శనివరం వంగర పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై పరిశీలన చేశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో దొంగతనాలకు ఆస్కారం లేకుండా రాత్రి సమయాల్లో పోలీస్ గస్తీ చేపట్టాలన్నారు. అనుమానిత వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు సంచారంపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. వాహనదారులకు హెల్మెట్స్ వాడకం తప్పనిసరి చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వాహనదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. పోక్సో చట్టంపై యువతతో పాటు విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మెలగాలన్నారు. పోలీసులు గ్రామాల్లో ప్రజలతో సోదర భావంగా మెలగాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్సై షేక్ శంకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


