కొనసాగుతున్న స్కూల్ గేమ్స్
సీతానగరం: మండలంలోని జోగింపేట ఎస్‌వోఈ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్ షిప్ (2025 – 26) అండర్ 14, 17, 19 బాల బాలికల పోటీలు శనివారం కూడా జరిగాయి. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోటీలు శనివారం కూడా జరగ్గా ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలురు 193 మంది, బాలికలు 186 మంది పాల్గొన్నారు. సెమీఫైనల్స్ ఆదివారం జరగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రాజకుమార్, ఎంఈవోలు జి.సూరిదేముడు, ఎం.వెంకటరమణ, పోటీల నిర్వహణ ఇన్‌చార్జి పీడీ సబ్బాన మురళి, జోగింపేట ఎస్‌వోఈ విద్యాలయం ప్రిన్సిపాల్ ధర్మరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయ ప్రిన్సిపాల్, 13 జిల్లాల ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, పీడీలు పాల్గొన్నారు.


