
ఎరువుల సరఫరాపై పర్యవేక్షణ
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎరువుల సరఫరాను పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 12,944 టన్నులు సరఫరా అయ్యిందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల లభ్యత, పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నామన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అవసరమైన యూరియా వస్తుందని, ఇప్పటి నుంచి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించవద్దని రైతులకు సూచించారు. డీఏపీ, పొటాష్, సూపర్ పాస్పేట్, కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 245 రైతు సేవ కేంద్రాల ద్వారా 7,235 టన్నులు, 22 సొసైటీల ద్వారా 1,369 టన్నుల యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ఇటీవల అనేక ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్రవరూప ఎరువులైన నానో యూరియా, డీఏపీ ఎరువులను రైతు సేవ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. ఎరువులకు సంబంధించి ఏదైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం అవసరమైతే జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్: 79894 34766కు కాల్ చేయవచ్చన్నారు.
జల్లాలో 12,944 టన్నుల యూరియా పంపిణీ
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్