●గురువుల డిమాండ్ ●12వ పీఆర్‌సీ అమలు చేసి సీపీఎస్ రద్దు చేయాలి ●12వ వేతన సవరణ అమలుకు డిమాండ్ ●ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నేడు నిరసనకు ఉపాధ్యాయులు సిద్ధం
పార్వతీపురం టౌన్:
ఉపాధ్యాయులు అంటే చదువు నేర్పేవారు... ఇది ఒకప్పటి సంగతి. ప్రస్తుతం పిల్లలు బడికి వచ్చేది, మధ్యాహ్న భోజనం, దుస్తులు, కోడిగుడ్డు, చిక్కి, రాగి జావ విద్యార్థులకు అందించి ప్రభుత్వానికి లెక్క చెప్పేవారు అన్నట్టుగా మారింది. ప్రభు త్వ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఒత్తిడి తెచ్చింది. ఇవన్నీ చేయగా సమయం మిగిలితేనే విద్యార్థులకు నాలుగు అక్షరాలు చెప్పే అవకాశం ఉంటుంద ని ఉపాధ్యాయుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పా ఠాలు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు ఇవే...
●ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయవద్దు.
●నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకు న్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
●ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న ఆసంబద్ధతను తొలగించాలి. 72, 71, 74 జీఓలు అమలు చేయాలి.
●హైస్కూల్ ప్లస్‌లలో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి.
●పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి.
●12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి.
●ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 3 పెండింగ్ డీఏలను ప్రకటించాలి.
●డీఏ బకాయిలు, 11వ పీఆర్‌సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
●సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
– ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
●పదవీకాలం పూర్తికాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను (ఎస్‌జీఎఫ్) సెక్రటరీలను తొలగించడం సరైనది కాదు. తిరిగి వారిని కొనసాగించాలి.
●అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి.
●సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి.
●బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి
ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలి. బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలి. బదిలీలు జరిగి 45 రోజులు దాటినా కొందరు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడం విచారకరం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నేడు కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతాం.
– పువ్వల కూర్మినాయుడు, ఫ్యాప్టో చైర్మన్, పార్వతీపురం మన్యం
బోధనకు దూరం చేయొద్దు
బోధనకు దూరం చేయొద్దు