
సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా సురేష్
పార్వతీపురం రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వె వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంలో వివిధ హోదాల్లో పలువురిని నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలానికి చెందిన ఉపద్రష్ట సురేష్‌ను సోషల్‌మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను సూచించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు సురేష్ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ స్పందిస్తున్న తీరును వివరిస్తూ..సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని సురేష్ అన్నారు.