
దత్తత స్వచ్ఛందమే..
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం రూరల్: పీ–4 దత్తత పూర్తిగా స్వచ్ఛందమేనని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టం చేశారు. పీ–4, పీఎం సూర్యఘర్, హర్‌ఘర్ తిరంగ తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినవారికి బంగారు కుటుంబాలను బాగుచేసే బాధ్యతలు అప్పగించాలన్నారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్టీ, ఎస్సీ గృహాలపైన ఖాళీ స్థలం ఉంటే నెలకు రూ.200 వారికి అద్దె ఇస్తూ సౌరవిద్యుత్ ప్యానె ల్ ఏర్పాటు చేస్తామన్నారు. హర్‌ఘర్ తిరంగా వేడుకులను ఆగస్టు 15వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. త్రివర్ణ పతాకాలను గృహాలపై పెట్టడం, పెద్ద ఎత్తున ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఛాయా చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటుచేసి ప్రజల్లో భక్తిభావం పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కు మార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమల త, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పైనాపిల్ పార్క్‌కు
జిల్లా అనుకూలం
● మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్
పార్వతీపురం రూరల్: పైనాపిల్ పార్క్ ఏర్పాటుకు జిల్లా అనుకూలమని, ఆ దిశగా ఆలోచనలు చేయాలని మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరికం నుంచి మహిళలను ఆర్థికాభివృద్ధి దిశగా నడపడమే మెప్మా ఆశయమన్నారు. మహిళలతో కొత్త యూనిట్లను స్థాపించి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. చెత్త నుంచి వర్మీకంపోస్టు తయారీ, ఇంటి వద్దనే కూరగాయల తోటల సాగుతో లబ్ధిపొందే అవకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. డీజీ లక్ష్మి పథకం కింద డిజిటల్ కియోస్క్‌ల స్థాపించి 250 ప్రజా సేవలను ప్రజలకు అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో మెప్మా పథక సంచాలకులు జీవీ చిట్టిరాజు, సాంకేతిక నిపుణులు సీఎంఎంలు, సీఓలు, డీఈఓలు, సీఎల్‌ఆర్‌సీలు, టీఎల్‌ఎఫ్‌ఆర్‌సీలు పాల్గొన్నారు.
అరకు–విశాఖ రోడ్డులో
145 కేజీల గంజాయి పట్టివేత
లక్కవరపుకోట: ఒడిశా నుంచి నుంచి కేరళ రాష్ట్రానికి అరకు–విశాఖ జాతీయ రహదారిలో బొలెరో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సఫీ, ఒడిశాకు చెందిన దుంబిలను గొల్జాం కూడలి వద్ద పోలీస్‌లు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 145 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ నవీన్‌పడాల్ తెలిపారు.

దత్తత స్వచ్ఛందమే..