
అక్కసు ఎందుకు బాబూ?
● మున్సిపల్, అంగ్‌వాడీల మండిపాటు ● చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ ● కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన
అంగన్‌వాడీ,
చిరుద్యోగులపై..
పార్వతీపురం టౌన్:
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అవు ట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ సంక్షే మ పథకాలు క్రమం తప్పకుండా అందాయి.. పిల్లల చదువులకు ఆర్థిక కష్టాలు ఉండేవి కావు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అందజేస్తున్న అరకొర సంక్షేమ పథకాల ను అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయకపోవడం విచారకరం.. చాలీచాలని వేతనాల తో ఇబ్బందులు పడుతున్న వారికి సంక్షేమ పథకా లు నిలిపివేయడం అన్యాయం.. చిరుద్యోగులపై ఇంత అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ అవుట్ సోర్సింగ్, మున్సిపల్, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఽసీఐటీయూ, అంగన్‌వాడీ యూనియన్‌ల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కొందరు ఉద్యోగులు కన్నీరుకార్చారు. న్యాయం చేయాలంటూ డీఆర్వో హేమలతకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి కేవ లం రూ.13వేలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, ఇంతటి తక్కువ జీతం పొందుతున్న వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు వచ్చిన అరకొర జీతంతో బతకడం కష్టంగా మారిందన్నారు.
అంగన్‌వాడీలు ప్రభుత్వ ఉద్యోగులా...?
అంగన్‌వాడీ వర్కర్లకు 11,500, మినీ వర్కర్లు, హెల్పర్లకు రూ.7వేలు గౌరవ వేతనమే ఇస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.12వేలు జీతం లోబ డే ఉంది. అయినా అంగన్‌వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకం వర్తించలేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా రికార్డుల్లో నమోదు చేసి ఉంటే.. తక్షణమే ఉద్యోగభద్రత కల్పి ంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవా ధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ, కాంట్రాక్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయి స్ యూనియన్ నాయకులు ఎస్.అవినాష్ కుమార్, ఎన్.కమల, వై.శ్రీధర్, బి.కొండలరావు, ఎ.బుజ్జ మ్మ, ఎం.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టి సారించాలి
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్‌వాడీలు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వేతనాలు పెంచకపోగా ఇప్పుడు సంక్షేమ పథకాలను రద్దుచేయడం సరైన విధానం కాదు. అంగన్‌వాడీలను, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా పరిగణిస్తారు? ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి అందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలి.
– సీహెచ్ రేవతి, అంగన్‌వాడీ వర్కర్

అక్కసు ఎందుకు బాబూ?

అక్కసు ఎందుకు బాబూ?