
ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కు ల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ పరిశ్రమలశాఖ అధికారులను ఆదే శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాల ని ఇప్పటికే ఆదేశాలు జారీచేసిన సంగతిని గుర్తుచేశారు. అందులో భాగంగా పాలకొండ, పార్వతీపు రంలో ఏర్పాటు చేస్తున్నామని, సాలూరు, కురు పాం నియోజక వర్గాల్లో స్థలాలు గుర్తించినప్పటికీ, ప్రారంభించాల్సి ఉందన్నారు. పారిశ్రామిక ఎగుమ తుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్థితిని సమీక్షిస్తూ శిక్షణ పొందిన లబ్ధిదారుల డేటాను వేరు చేసి సంబంధిత ఎంపీడీఓ, ఏపీఎం, క్లస్టర్ కోఆర్డినేటర్లు, సంక్షేమ సహాయకులకు తెలియజేయాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత అధికారులు ఆమోదం తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు మొత్తం 97 దరఖాస్తులను స్వీకరించామని, వాటిలో ఏపీపీసీబీ వద్ద మూడు, ఫ్యాక్టరీల వద్ద ఒకటి, లీగల్ మెట్రాలజీ విభాగం వద్ద మూడు వెరసి మొత్తం ఏడు పెండింగ్ మినహా మిగిలిన 90 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కలెక్టర్‌కు వివరించారు. 2022 ఏప్రిల్ 4 నుంచి ఇప్పటి వరకు 398 దరఖాస్తులకు అనుమతులు జారీ కాగా 94 యూనిట్లు గ్రౌండింగ్ అయినట్లు చెప్పారు. పీఎం విశ్వకర్మ కింద జిల్లావ్యాప్తంగా 25,493 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 1,253 మందికి శిక్షణ ఇచ్చామని, 76 మందికి రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.వి.కరుణాకర్, సహా య సంచాలకులు పి.సీతారాము, రామకష్ణ, ఐపీఓ కిరణ్, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎన్.విజయ్‌స్వరూప్, నాబార్డు ఏజీఎం దినేష్, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.