
భూసర్వేపై తస్మాత్..
● సర్వే శాఖ డీడీ కుమార్
పూసపాటిరేగ: భూసర్వేపై అప్రమత్తంగా వుండాలని సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్ డిఎల్‌బిఎల్.కుమార్ అన్నారు. పూసపాటిరేగలో జరుగుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. రోవర్‌తో సర్వే చేసినప్పుడు హద్దులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. బ్లాక్‌ల వారీగా సర్వే జరిగినప్పుడు వీఆర్‌వోలు, విలేజి సర్వేయర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పూసపాటిరేగ మండలం గోవిందపురంలో సర్వే పూర్తయిందని మండల సర్వేయర్ గణపతిరావు తెలియజేశారు. పూసపాటిరేగ గ్రామంలో 170 ఎకరాల వరకు సర్వే జరిగినట్టు చెప్పారు. అనంతరం తహసీల్దార్ గోవిందను కలిసి సర్వే జరుగుతున్న తీరు, ఏవైనా సమస్యలు వున్నాయా.. మొదలగు అంశాలను అడిగారు. ఆయనతో పాటు ఆర్‌ఎస్ డీటీ కల్యాణి, డీటీ రమేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాధురి ఉన్నారు.