
అంతర్జాతీయ స్థాయిలో ప్రవల్లిక ప్రతిభ
విజయనగరం టౌన్: పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆఫ్ దుబాయ్, పిరమిడ్ యోగా అండ్ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ నెల 18న నిర్వహించిన పోటీల్లో భారత్‌కు చెందిన సాయినాథ్ కళా కమిటీ, ఎస్‌కేఎస్ అకాడమీలు పాల్గొన్నాయి. జిల్లాకు చెందిన కోలక ప్రవల్లిక దుర్గాదేవీగా వివిధ భారతీయ నృత్య రీతులను ప్రదర్శించి మన్ననలు పొందారు. ఇండియన్ కాన్సులేట్‌కి చెందిన అరుజిత్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవల్లికకు నృత్య యువ ప్రతిభ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. ప్రవల్లికను పలువురు అభినందించారు.