
ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
పార్వతీపురం టౌన్: సీఎం చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అలాగే జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబులాంటి విజనరీ లీడర్ దేశంలో ఇంకొకరు లేరన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. బలిజిపేట మండలంలో రక్తదాన శిబిరం నిర్వహించి రక్తం యూనిట్లను జిల్లా ఆస్పత్రికి అందజేశారు. కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, టీడీపీ నా యకులు, కార్యకర్తలు, ఆభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు