పాలకొండ రూరల్: మహానుభావుల పేరు పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తూ వైఎస్సార్ సీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించినా వినేవారు లేరన్నది టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు గుర్తెరగాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ హితవు పలికారు. గత ప్రభుత్వంలో లిక్కరు కుంభకోణం జరిగిందంటూ పార్లమెంట్‌లో తప్పుడు ఆరోపణలు చేయడాన్ని బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. జగన్ హయాంలో ఏ ఒక్క డిస్టలరీకి అనుమతులు ఇవ్వలేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు అనుమతులతో పుట్టుకొచ్చిన డిస్టలరీలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఆ డిస్టలరీల ద్వారా జరిగిన మద్యం సరఫరాల్లో అవకతవకలు ఉంటే టీడీపీదే బాధ్యతన్నారు. కూటమి కుటిల రాజకీయాలను ప్రజలు, మేధావులు, ఓటర్లు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికై నా తప్పుడు వాఖ్యలు మానుకొని, మహానుభావుల పేరు పెట్టుకున్నందుకు హూందాగా వ్యవహరించాలని హితవుపలికారు.
లిక్కరుపై ఎంపీ కృష్ణదేవరాయుల వాఖ్యలు అవాస్తవం
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్


