● డీఎంహెచ్‌ఓ భాస్కరరావు
గుమ్మలక్ష్మీపురం: ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యమని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కరరావు అన్నా రు. గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి సీహెచ్‌సీని బుధవారం సందర్శించారు. నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం సీహెచ్‌సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రగి రి ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న 50 పడకల ఆస్ప త్రి భవనాన్ని మే నెలలో ప్రారంభిస్తామన్నారు. మలేరియా నిర్మూలనలో భాగంగా జిల్లాకు సుమా రు 4 లక్షల దోమ తెరలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సినీ నటుడు సోనూసూద్ జిల్లాకు ఇచ్చిన అంబులెన్స్‌లలో ఒకటి భద్రగిరి సీహెచ్‌సీకి కేటాయించామన్నారు. అనంతరం మండలంలోని ఎస్.కె.పాడు గ్రామంలో నిర్వహించిన 104 వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కురుపాం మండలం మొండెంఖల్లు పీహెచ్‌సీని సందర్శించి మందుల నిల్వలు, రికార్డుల పరిశీలనతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట జిల్లా ప్రొగ్రాం ఆఫీసర్ జగన్‌మోహన్‌రావు, భద్రగిరి సీహెచ్‌సీ, తాడికొండ పీహెచ్‌సీ వైద్యులు ఉన్నారు.