నరసరావుపేట ఈస్ట్: వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పీజీ–2026 పరీక్షలో భాగంగా ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో 984 మందికిగాను 956 మంది హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. సాయి తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో 195 మందికి 192, నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (బ్లాక్–4)లో 204 మందికి 196, నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో 250 మందికి 245, ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాలలో 80 మందికి 74 మంది, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 255 మందికి గాను 249 మంది హాజరయ్యారు. ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే దూరప్రాంతాల నుంచి అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు.


