జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి

Jun 25 2026 4:47 AM | Updated on Jun 25 2026 4:47 AM

విజయపురిసౌత్‌: జల్‌ జీవన్‌ మిషన్‌ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎన్‌సీసీ ప్రతినిధులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. బుధవారం స్థానిక రివర్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రతినిధులు, ఫారెస్ట్‌, టూరిజం అధికారులతో ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమీక్షించారు. తొలుత మేకల గొంది వద్ద రూ. 1,200 కోట్లతో నిర్మిస్తున్న జలజీవన్‌ మిషన్‌ వాటర్‌ గ్రిడ్‌ పనులను పరిశీలించారు. అనంతరం రూ.25 కోట్లతో నిర్మిస్తున్న బుద్ధిస్ట్‌ ఎక్సపిరియన్స్‌ సెంటర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షులు ఎం.దారునాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ చంద్రశేఖర్‌, డీఏఎఫ్‌ కృష్ణ ప్రియ, మార్కాపురం వైల్డ్‌ లైఫ్‌ డీఎఫ్‌ఓ రవూఫ్‌, నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌ జీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement