నెహ్రూనగర్: గుంటూరు నగరంపాలెంలోని ఎస్వీఎన్‌ఆర్ రెడ్డి వసతి గృహంలో బుధవారం కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్ నిర్వాహకులు దశాబ్దాలుగా పేద విద్యార్థులకు వసతి కల్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పించడం అభినందనీయమన్నారు. కొత్త భవనంతో వసతి గృహంలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ కమిటీ అధ్యక్షులు చల్లా అంజిరెడ్డి, ఉపాధ్యక్షులు సూరసాని వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కార్యదర్శి కంది సంజీవరెడ్డి, కోశాధికారి పనుకూరి వెంకటేశ్వరెడ్డి, మేనేజర్ జంగా సత్యనారాయణరెడ్డి, వణుకూరి సూరారెడ్డి, వైద్యులు జైపాల్ రెడ్డి దంపతులు, వరికూటి అశోక్ రెడ్డి దంపతులు, మార్బుల్ శివారెడ్డి, జంగా రాంబాబు, వీసీఆర్ రెడ్డి, లేళ్ల పెద్ద అప్పిరెడ్డి, కుర్రా సాంబిరెడ్డి, చాగంటి రఘురామిరెడ్డి, వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి, భవనం వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.


