టీడీపీ మూకల దాడి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మూకల దాడి

Jun 23 2026 1:40 AM | Updated on Jun 23 2026 1:40 AM

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల నెహ్రూనగర్‌లోని వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరుడు తమ్మిశెట్టి శ్రీహరి కుటుంబంపై ఆదివారం అర్ధరాత్రి టీడీపీ మూకలు దాడిచేశాయి. ఆ దాడిలో శ్రీహరి కాళ్లు విరగొట్టి, ఆయన బంధువు మంగమ్మ చెయ్యి విరగ్గొట్టారు. ఈనెల 18న వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం బూత్‌ అధ్యక్షుడు శ్రీహరి, ఆయన బంధువు లక్ష్మయ్య, మంగమ్మ పాల్గొన్నారు. నిరసన ర్యాలీకి జన సమీకరణ చేశారనే ఆగ్రహంతో టీడీపీ మూకలు కర్రలు, మారణాయుధాలతో దాడిచేశారు. టీడీపీకి చెందిన పోటేళ్ల శ్రీను, మల్లేశ్వరి, రాంబాబు, వెంకటేష్‌ (బోండాల), బుల్లికొండ, దుర్గారావు, డేరంగుల నరసింహారావు, సాంబయ్య, వెంకటేశ్వరరావుతోపాటు, మరో ఎనిమిది మంది కలిసి అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. దీన్ని ప్రతిఘటించిన సమయంలో శ్రీహరి, మంగమ్మ తీవ్ర గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నరసరావుపేటలోని ఆస్పత్రికి తరలించారు. 11 మంది టీడీపీకి చెందిన వారు తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చారు. పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు తమపైనే అక్రమ కేసు బనాయించినట్టు వారు వాపోయారు.

నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement