వ్యవస్థను వేధిస్తున్న మరో ప్రధాన సమస్య సిబ్బంది కొరత. 1986 తర్వాత గ్రంథాలయాల్లో పూర్తిస్థాయి నియామకాలు జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని 98 గ్రంథాలయాల్లో ఏకంగా 94 లైబ్రేరియన్, అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 100 పోస్టుల భర్తీకి మాత్రమే పరిమితం కావడం నిరుద్యోగులను, పుస్తకాభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.
ఒక్క ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 100 ఖాళీలు ఉంటే, రాష్ట్రం మొత్తానికి కలిపి అదే సంఖ్యలో పోస్టులు ప్రకటిస్తే గ్రంథాలయాల పునరుద్ధరణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు
తలెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైబ్రరీలకు రావాల్సిన బకాయిలు రూ.64.34 కోట్లు గ్రంథాలయాలలో కనిపించని కొత్త పుస్తకాల కొనుగోలు వినిపించని శిథిలావస్థకు చేరిన భవనాలకు మరమ్మతులు వేధిస్తున్న సిబ్బంది కొరత పాలకుల ఉదాసీనత.. స్థానిక సంస్థల మొండి వైఖరి
వాగ్దానాల వెలుగు..వాస్తవాల చీకటి
యడ్లపాడు: విజ్ఞాన గనిగా నిలిచే గ్రంథాలయాలు నేడు వెలుగు తగ్గిన ప్రమిదల్లా కునారిల్లుతున్నాయి. సాంకేతిక విప్లవం నేపథ్యంలో సైతం గ్రంథ పరిమళాన్ని ఆస్వాదిస్తూ విజ్ఞానాన్ని సముపార్జించే పాఠకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఆ పాఠకులకు కనీస సౌకర్యాలు కల్పించలేని, దినపత్రికల బిల్లులు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలోకి వ్యవస్థ జారిపోవడం అక్షర సేద్యంపై పాలకులకున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నులో 8 శాతం గ్రంథాలయాల నిర్వహణకు ‘సెస్’ (పన్ను) రూపంలో చెల్లించాల్సి ఉండగా, ఆ నిధులు సకాలంలో గ్రంథాలయ సంస్థలకు చేరడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన రూ. 64.34 కోట్ల బకాయిలే ఈ వ్యవస్థ నిర్వీర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పైసా విదల్చని పురపాలికలు..
ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం స్వాగతించదగ్గదే అయినా, క్షేత్రస్థాయిలో ఉన్న వేల కోట్ల బకాయిలను వసూలు చేయడంలో చూపుతున్న జాప్యం ఆశయాలకు ఆటంకంగా మారుతోంది. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ పెండింగ్ నిధులను రాబట్టకపోతే, గ్రంథాలయాలు కేవలం నామమాత్రపు భవనాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.


