బాలిక ఆపరేషన్‌కు రూ.లక్ష వితరణ | - | Sakshi
Sakshi News home page

బాలిక ఆపరేషన్‌కు రూ.లక్ష వితరణ

Mar 19 2026 7:55 AM | Updated on Mar 19 2026 7:55 AM

బాపట్ల: కర్లపాలెం మండలంలోని పెద్దపులివారిపాలెం సర్పంచ్‌ అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతితోపాటు పార్టీ నాయకులు కలిపి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె ఆపరేషన్‌ నిమిత్తం నగదు అందజేసి ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులతో కోన మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, పేరాల వెంకట సురేష్‌, ధర్మేంద్ర, ఆట్ల నాగేశ్వరరెడ్డి ఉన్నారు.

గుండెపోటుతో

ఎస్‌ఐ మృతి

చీరాల: ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటి వద్ద గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్‌, ఒన్‌టౌన్‌ సీఐ ఎస్‌.సుబ్బారావు, టూటౌన్‌, రూరల్‌ సీఐలు అశోక్‌కుమార్‌, శేషగిరిరావులు, ఎస్‌ఐలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆయన ఎస్‌ఐగా పదోన్నతి పొంది చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. 42 సంవత్సరాల పాటు పోలీస్‌శాఖలో సేవలందించారు. ఆయన మరణంపై సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement