పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు బుధవారం సిలిండర్ల లారీ వస్తుందని తెలిసిన వినియోగదారులు ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రాత్రి ఏడు గంటల సమయంలో గ్యాస్ సిలిండర్లతో కూడిన లారీ రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం నిర్వాహకుల వల్ల కాలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి వినియోగదారులను క్యూలైనులో నిలబెట్టారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు ఒక్కొక్కరికి కూపన్లు ఇచ్చి గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం చేపట్టారు.
రాత్రివేళ వినియోగదారుల నిరీక్షణ


