కళ తప్పిన సంక్రాంతి
న్యూస్‌రీల్
తుపానుతో భారీ నష్టం
నిమ్మకాయల ధరలు
సాగర్ నీటిమట్టం వివరాలు
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
పల్నాడు
● పల్లెల్లో కానరాని పండుగ వాతావరణం
● తుపానులు, తెగుళ్లతో కుదేలైన రైతులు
● మాట వరుసకై నా ఆదుకోని
చంద్రబాబు ప్రభుత్వం
● విత్తనాలు, ఎరువుల నుంచి
మద్దతు ధర వరకు భరోసా కరువు
● అమలుకు నోచుకోని సార్వత్రిక
ఎన్నికల హామీలు
● సామాన్యుడి చేతిలో చిల్లిగవ్వ
లేక కుటుంబాలు విలవిల
I
సత్తెనపల్లి: పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతిచోట సందడి కనిపించే పెద్ద పండుగ సంక్రాంతి. కానీ అదే నేడు కళ తప్పింది. సంప్రదాయాలతో, ఉత్సాహభరిత వాతావరణం కనిపించే రైతన్న పండగ ఇది. పంటలు సాగు పూర్తి చేసి దిగుబడులు విక్రయిస్తారు. పశువులను పూజించి జరుపుకొనే ఈ పండుగ కరువు వాకిట నిలిచింది. ప్రభుత్వ నిరాదరణ, సాగుచేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గడం, పాలకుల నుంచి మద్దతు ధర దక్కక పోవడంతో కష్టాల సేద్యం చేసిన రైతుల కళ్లల్లో దైన్యం తప్ప కాంతి లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం రైతు భరోసాతో రైతులను ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం అంతకుమించి ఆదుకుంటామంటూ అరకొరగా విదిల్చి మొండిచేయి చూపింది. రైతులకు కష్టాలు, కన్నీళ్లు నలువైపులా చుట్టుముట్టగా సంక్రాంతి కళ తప్పింది.
జిల్లాలో ఖరీఫ్ 2.01 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. వాటిలో ప్రధానంగా 66,316 హెక్టార్లలో వరి సాగైంది. దిగుబడి 4,36,169 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. దీనికిగాను వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17 శాతం లోపు తేమ ఉంటే ఏ గ్రేడ్ రకం 75 కిలోల బస్తా రూ.1,792 మద్దతు ధరకు, సాధారణ రకం రూ. 1,772 కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. మోంథా తుఫాన్‌తో రైతులకు దిగుబడులు గణనీయంగా తగ్గాయి. గింజ పాలు పోసుకునే దశలో తుఫాన్, వర్షం కురవడంతో తాలుగా మారింది. ఎకరాకు 35 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు కేవలం 20 బస్తాలకే పరిమితమైంది. దీనిలో తేమ శాతం పేరుతో అధికారులు అరకొరగా కొనుగోలు చేయగా, వ్యాపారులు అడ్డదిడ్డంగా దోచేశారు. మోంథా వలన 114.75 హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్న రైతులకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గణాంకాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించారు. అయినప్పటికీ ఒక్క పైసా పరిహారం రైతులకు దక్కలేదు. జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో పత్తి పంటను 1,20,400 మంది రైతులు సాగు చేశారు. 12.28 లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 11 జిన్నింగ్ మిల్లులలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తేమ శాతం పేరుతో రైతులకు మద్దతు ధర దక్కలేదు. సీసీఐ ఆంక్షల కారణంగా రైతులు బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.6 వేల నుంచి రూ.7200 వరకు దళారులకు విక్రయించి నష్టపోయారు. ఎకరానికి 15 క్వింటాళ్లు రావలసిన దిగుబడి కేవలం 5–6 క్వింటాళ్లకే పరిమితమైంది. రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారుకు మనసు రాలేదు.
సంక్రాంతి అంటే పల్లెల్లో ఎంతో హడావుడి ఉంటుంది. ఊరూరా పండుగ వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపించేది. ప్రస్తుతం ఆ సందడి కరువైంది. నిండైన పంటలతో కళకళలాడాల్సిన రైతుల లోగిళ్లు ప్రకృతి వైపరీత్యాలతో బావురమంటున్నాయి. సంక్షేమ పథకాలతో అండగా నిలబడాల్సిన చంద్రబాబు సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఫలితంగా ఈ సారి పండగ వేళ పల్లె వాసుల్లో మునుపటి సంతోషం కనిపించడం లేదు.
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.2500, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3500 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 555.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 45,242 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 38.7890 టీఎంసీలు.
కళ తప్పిన సంక్రాంతి
కళ తప్పిన సంక్రాంతి
కళ తప్పిన సంక్రాంతి
కళ తప్పిన సంక్రాంతి
కళ తప్పిన సంక్రాంతి


