మాయప్పిరాన్ అలంకరణలో శ్రీవారు
మంగళగిరి టౌన్: లడక్‌లో ఈ నెల 20 నుంచి 27వ తే దీ వరకు జరిగే ఖేలో ఇండియా గేమ్స్– 2026కు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత, అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై ంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీరాజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి బాలికల విభాగంలో ఎంపికై న ఏకై క స్కేటర్‌గా నిలవడం విశేషం. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్న జెస్సీ వ్యక్తిగత ప్రతిభకు నిదర్శంగా నిలవడమే కాకుండా రాష్ట్రానికే గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి షేక్ ఖాజా పేర్కొన్నారు. దీంతో పలువురు క్రీడాకారులు, నాయకులు ఈ ఆమెకు అభినందనలు తెలిపారు.
చేబ్రోలు: చేబ్రోలు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల బృందాలు మంగళవారం విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 3072 సర్వీసులను తనిఖీ చేసి 123 మందిపై కేసులు నమోదు చేసి రూ.5.63 లక్షల జరిమానా విధించినట్లు తెనాలి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. మీటరు లేకుండా డైరెక్టుగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఐదు కేసులకు రూ.20 వేలు, అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 111 సర్వీసులకు రూ.4.43 లక్షలు, మాల్ ప్రాక్టీస్ సంబంధించి ఏడు కేసులకు రూ.లక్ష జరిమానా విధించినట్లు తెలిపారు. ఈఈ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీఈ (విజిలెన్సు) కే రాజశేఖర్, కే రవికుమార్, ఎ.సుందరంబాబు, మల్లికార్జున ప్రసాద్, శ్రీనివాసరావు, స్థానిక ఏఈ బి.శ్రీనివాసరావు, చేబ్రోలు, తెనాలి డివిజన్ వివిధ సెక్షన్ల డీఈఈలు, ఏఈఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
మాయప్పిరాన్ అలంకరణలో శ్రీవారు
మాయప్పిరాన్ అలంకరణలో శ్రీవారు


