19నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

19నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

Jan 14 2026 9:57 AM | Updated on Jan 14 2026 9:57 AM

19నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

19నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు

19నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు నరసరావుపేటరూరల్‌: ఈనెల 19వ తేదీ నుంచి 31 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. పశువైద్య శిబిరాల ప్రచార పత్రాలు, వాల్‌పోస్టర్లను కలెక్టరేట్‌లో మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పశువులు, లేగ దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నిర్మూలన మందులు ఉచితంగా వేస్తారని తెలిపారు. గొర్రెలకు బొబ్బ వ్యాధి నిరోధక టీకాలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ టీకాలు వేస్తారని పేర్కొన్నారు. అనారోగ్య పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వనున్నట్టు వివరించారు. జిల్లా పశుసంవర్దక అధికారి డాక్టర్‌ బి.శ్రీనివాసరావు, డీడీ డాక్టర్‌ రామారావు, ఏడీలు డాక్టర్‌ సీహెచ్‌ కోటిరత్నం, డాక్టర్‌ రామచంద్రరావులు పాల్గొన్నారు.

జిల్లాలో జనగణన ప్రత్యేక ప్రణాళికతో నిర్వహిస్తాం

నకరికల్లు–ఓడరేవు రహదారి స్థల పరిశీలన

నకరికల్లు– చీరాల 167–ఏ జాతీయ రహదారికి సేకరించనున్న భూములను మంగళవారం కలెక్టర్‌ కృతికా శుక్లా పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా నరసరావుపేట బైపాస్‌ రోడ్డు ప్రారంభమయ్యే రావిపాడు వద్ద అధికారులతో ఆమె చర్చించారు. మ్యాప్‌ను పరిశీలించి ఎంత మంది రైతుల నుంచి ఎంత పొలం సేకరించాల్సి ఉంది, సర్వే నంబర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పరిహారం విషయంలో ఏర్పడిన అడ్డంకులను ఆర్డీవో మధులత వివరించారు. రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో భూముల ధరలు, మార్కెట్‌లో ధర ఎంత ఉంది తెలియజేశారు. కోర్టు కేసుల అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భూ సేకరణను ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో సర్వేయర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలి

నరసరావుపేట : పల్నాడు జిల్లాలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు సక్రమంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ సేవల్లో అనధికార చెల్లింపులు గురించి కక్షిదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు మంగళవారం జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్‌ రిజిస్ట్రేషన్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సకాలంలో రిజిస్ట్రేషన్‌ చేయాలని, దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ సేవలు అన్ని డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉన్నందున అమరావతి మండలంలోని నాలుగు గ్రామాలైన పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వైకుంటపురం డిజిటలైజేషన్‌ అన్ని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ కోసం ప్రజలు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వచ్చినప్పుడు సిబ్బంది ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని, దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ సులభతరం చేయాలని అన్నారు. ప్రతి కార్యాలయంలో అందుబాటులో వున్న సేవలు, చెల్లించవలసిన ప్రభుత్వ రుసుముల గురించి, స్లాట్‌ బుకింగ్‌ విషయంపై రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలలో మరింత అవగాహన పెంచేందుకు నోటీసు బోర్డులు, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. డీఆర్‌ఓ ఏకా మురళి, గుంటూరు జిల్లా డీఐజీ జి.శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా రిజిస్టార్‌ ఏవీఆర్‌కే శ్రీనివాస్‌, ఆయా సబ్‌ రిజిస్టార్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో జనగణన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ కృతిక శుక్లా ఇన్‌చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌కు వివరించారు. మంగళవారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లతో జనగణన అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా జనాభా లెక్కల అధికారిగా డీఆర్‌ఓను నియమించామని, జిల్లా ప్లానింగ్‌ ఆఫీసర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, జడ్పీ సీఈవో, సర్వే శాఖ ఏడీ, పంచాయతీరాజ్‌ అధికారి, జిల్లా ఫారెస్టు ఆఫీసర్‌ జిల్లా అదనపు జనాభా లెక్కల అధికారులుగా నియమించామని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement